రాప్తాడు ఘటన: ఉన్మాది హేమంత్ కుడి కాలును తొలగించిన వైద్యులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించినట్లు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. విద్యార్థిని గోపికపై దాడి చేసి పోలీసుల కాల్పుల్ లో గాయపడిన హేమంత్ కుడి కాలుకు రక్తప్రసరణ నిలిచిపోవడంతో మోకాలి పైవరకు తొలగించామని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఏఎంసీలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఎడమ కాలికి కూడా సర్జరీ చేసినట్లు స్పష్టం చేశారు.