లక్నోలో ఉగ్ర కుట్ర భగ్నం: నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఏటీఎస్

రిపోర్టర్: రాము స్థలం: Lucknow

పాకిస్థాన్ ఉగ్రవాద హ్యాండ్లర్ ఆదేశాలతో లక్నోలో పోలీసు లేదా సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్ర పన్నిన నలుగురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీ అమితాబ్ యశ్ వెల్లడించారు. పంజాబ్కు చెందిన నిందితుల నుంచి పిస్తోల్, ఇరవై తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా విదేశీ నంబర్లతో చాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.