రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Andhra Pradesh

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కరువు ప్రాంతాలకు, పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తరలించే పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. 'తెలుగు తల్లికి జలహారతి' పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యతో సాగునీటి కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.