సింహాచలం ఆలయంలో కొత్త రూల్: భక్తులకు తప్పనిసరి సాంప్రదాయ వస్త్రధారణ నిబంధనలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న ఆలయంలో సాంప్రదాయ దుస్తుల నియమావళిని అమలు చేస్తున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. క్షేత్ర పవిత్రతను పరిరక్షించేందుకు భక్తులు నిర్దేశించిన వస్త్రధారణ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. పురుషులు ధోతీ, కుర్తా పైజామా, మహిళలు చీర, చుడీదార్ లతో మాత్రమే రావాలని పేర్కొన్నారు. నిక్కర్లు, టీ షర్టులు ధరించి వచ్చే వారికి ఆలయ ప్రాంగణంలోనికి అనుమతి ఉండదని, పవిత్రతను కాపాడటంలో భక్తులు సహకరించాలని కోరారు.