డ్రైవర్ పై సల్మాన్ ఖాన్ ఆగ్రహం మరియు వీడియో వైరల్
రిపోర్టర్: రమేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గణపతి ఉత్సవాల సందర్భంగా రాజకీయనాయకుడు ఆశిష్ షేలర్ నివాసానికి వెళ్లినప్పుడు భారీ జనసమూహం మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కారు కదులుతున్న సమయంలో అభిమాని కాస్తా కారు కిందకు రావడంతో ఆగ్రహించిన సల్మాన్ ఖాన్ తన డ్రైవర్ పై చేయిచేసుకుని మందలించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.