ఆదిలాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు, ఆరుగురు అరెస్ట్

రిపోర్టర్: హరి స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ కరెన్సీ మార్పిడికి యత్నించి మోసపోయిన బాధితులు, డబ్బు రాబట్టుకునేందుకు కిడ్నాప్‌నకు పాల్పడిన విచిత్ర ఘటన వెలుగుచూసింది. రూ.లక్షకు నాలుగు లక్షల నకిలీ నోట్ల ఆశ చూపిన నాగ్పూర్ గ్యాంగ్, పోలీసులమని బెదిరించి రూ.5 లక్షలతో పరారైంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ముగ్గురిని కిడ్నాప్ చేశారు. ఈ రెండు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.