ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: దిల్లీ

కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఎస్ఐఆర్ విధానం భారతీయుల ఓటు హక్కును హరించే పద్ధతిగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ దిల్లీలో మండిపడ్డారు. దిల్లీలో 33.13 లక్షల మందికి ఈసీ నోటీసులు జారీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.