బెంగుళూరులో దారుణం: పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేసిన దుండగులు అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: Doddaballapur
బెంగుళూరు సమీపంలోని దొడ్డబల్లాపురంలో మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన బషీర్ అహ్మద్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను కాపాడటానికి ప్రయత్నించిన కానిస్టేబుల్స్ మణికంట మరియు రాయప్ప పూజారిలపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో మరో మైనర్ నిందితుడిని రిమాండ్ హోమ్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.