ఉత్కంఠ పోరులో పొదలకూరు జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకున్న ప్రభాకర్ రెడ్డి

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలం జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్ రెడ్డి నలభై ఆరు ఓట్ల స్వల్ప మెజార్టీతో కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ ఓట్ల లెక్కింపులో చివరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఫలితం వెలువడిన వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించి విజేతకు శుభాకాంక్షలు తెలిపారు.