కావలిలో టీడీపీకి షాకిస్తూ భారీగా వైఎస్సార్సీపీలోకి చేరిన ముప్పై కుటుంబాలు
రిపోర్టర్: sujith reddy
స్థలం: కావలి
కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బట్ట్రకాగొల్లు గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాల టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఇన్చార్జ్ నాయకత్వంపై నమ్మకంతో వారు కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల స్థాయి వైయస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్తగా చేరిన వారికి ఘనంగా ఆహ్వానం పలికారు.