ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజావాణి: అర్జీలను నేరుగా స్వీకరించిన జిల్లా కలెక్టర్ దివాకర
రిపోర్టర్: విజయ్
స్థలం: ఖమ్మం
ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ స్వయంగా స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల వారీగా త్వరితగతిన పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికే ఈ వేదిక అని, ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.