తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి భక్తుల భారీ రద్దీ

రిపోర్టర్: శివ స్థలం: తిరుమల

తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రత్యేక టోకెన్లు లేని సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుండగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒకటి కంపార్టుమెంట్లలో భక్తులు బారులు తీరారు. గురువారం ఒక్కరోజే అరవై ఏడు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, మూడు కోట్ల నలభై లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.