లారీ ఆటో ఢీకొని ముగ్గురు దుర్మరణం

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బాడంగి మండలం దత్తిరాజేరు మండలం షికారుగంటి కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ తిరుపతి, రైతు ఆదినారాయణ, చేపల వ్యాపారి రాము అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాధితుల రోదనలు కంటతడి పెట్టಿಸುತ್ತన్నాయి.