మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రూ.30 లక్షల బంగారు నాగపడగ కానుక

రిపోర్టర్: కృష్ణ స్థలం: కృష్ణా జిల్లా

కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తురాలు రూ.30 లక్షల విలువైన బంగారు నాగపడగను కానుకగా సమర్పించారు. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ సోదరి తుమ్మల లక్ష్మి సుజాత 220 గ్రాముల బంగారపు నాగపడగను ఆలయ అధికారులకు అందజేశారు. అర్చకులు దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు.