'భారత జట్టులో స్థానమే లక్ష్యం': మహిళా ఏపీఎల్‌కు నెల్లూరు యువతుల ఎంపిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
మహిళా ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు సజ్జా సాయి శ్రీలక్ష్మి, మహాలక్ష్మి మనోజ ఎంపికయ్యారు. రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు సాయి శ్రీలక్ష్మి, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుకు మహాలక్ష్మి మనోజ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నెల 19 నుంచి మంగళగిరిలో జరగనున్న ఈ టోర్నీలో రాణించి, భవిష్యత్తులో భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఈ యువ ప్రతభావంతులు కఠిన ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.