ప్రజారోగ్యానికి సంజీవనిలా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య శాల..నాతరి స్వామి..

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

తాండూర్ ఎంపీపీ సిరంగి శంకర్

అల్లుడు డాక్టర్‌ బండారి తిరుపతి, డాక్టర్‌ శ్వేత ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోమంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన తిరుపతి హాస్పిటల్‌ను ఆదివారం పరికిపండ్ల నరహరి ఐఏఎస్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ నాతరి స్వామి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఆసంపల్లి నర్సయ్య, ఓబీసీ జిల్లా కో-చైర్మన్‌ బండి లక్ష్మణ్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు మారపాక వంశీ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు ఈ వైద్యశాల ఎంతో మేలు చేస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.