పులివెందుల ఓట్ల లెక్కింపుపై హైకోర్టు తీర్పు రిజర్వ్: ఉత్కంఠ

రిపోర్టర్: కృష్ణ స్థలం: పులివెందుల

పులివెందుల నియోజకవర్గంలో డెబ్బై పోలింగ్ బూతుల్ లో రీపోలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక విచారణ జరిపినట్లు న్యాయవాదులు తెలిపారు. డెబ్బై బూతులకు బదులుగా కేవలం నాలుగు చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ కౌంటింగ్ నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ మంగళవారం ఉదయం తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు స్పష్టం చేసినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.