స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ కేసులో సుప్రీంకోర్టు స్పందన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

గురుగ్రామ్‌లో జరిగిన స్టాండప్ కామెడీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల వివాదంపై బిగ్ బాస్ ఫేమ్ ప్రణీత్ మోర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు స్పందించింది. విభిన్న ప్రాంతాల్లో నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను ఒకచోట చేర్చాలని కోరుతూ ప్రణీత్ మోర్ వేసిన పిటిషన్‌పై కేంద్రం, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో తాను కేవలం హోస్ట్ మాత్రమేనని, ఇప్పటికే అన్ని వేదికల ద్వారా క్షమాపణలు చెప్పానని ప్రణీత్ మోర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.