మెదక్ పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం: కారు ఢీకొని రైతు దుర్మరణం
రిపోర్టర్: మహేష్
స్థలం: మెదక్
ధాన్యం కాపలా ముగించుకుని మోపెడ్ పై ఇంటికి వస్తున్న తిరుపతి కిషన్ అనే వృద్ధ రైతును వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెదక్ పట్టణ శివారులో పంచముఖి కమాన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు, విద్యుత్ అందుబాటులో లేకపోవడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.