బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
అన్ని ప్రభుత్వశాఖల నుంచి బడ్జెట్‌కు భారీగా ప్రతిపాదనలు వస్తున్నాయని, ఆర్థికశాఖపై తీవ్ర ఒత్తిడి ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రాధాన్యాలు గుర్తించి ఖర్చు చేయకపోతే నిధుల వృథా తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడిని ఆర్థికశాఖకు బదిలీ చేయవద్దని, ప్రాజెక్టుల వారీగా స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని కలెక్టర్ల సదస్సులో ఆయన సూచించారు.