'కొడుకును రక్షించబోయి..': కాలువలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు గల్లంతు
రిపోర్టర్: సతీష్
స్థలం: నంద్యాల
నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో పడిన 6 ఏళ్ల బాలుడు ఆరిష్‌ను రక్షించేందుకు దూకిన తండ్రి అఫ్రోజ్, బావమరిది ఆసిఫ్ నీటిలో గల్లంతయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు కావడంతో రామాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.