'బాంబ్ బెదిరింపు లేఖ రాసింది కో పైలట్టే': అహ్మదాబాద్‌లో సంచలన నిజాలు వెలుగులోకి
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుజరాత్
దామ్మామ్ నుండి న్యూఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో బాంబ్ బెదిరింపు లేఖ రాసిన కేసులో విమాన తొలి అధికారి (కో పైలట్) ప్రధాన నిందితురాలిగా తేలింది. అహ్మదాబాద్‌లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు, ఆమె చేతిరాత బెదిరింపు లేఖతో 65 శాతం పోలి ఉన్నట్లు గుర్తించారు. లై డిటెక్టర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో పాటు, ఆమె వాంగ్మూలంలో పొంతన లేకపోవడంతో కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు.