తీరం దాటి బలహీనపడిన అర్నబ్ తుపానుతో వణుకుతున్న కోస్తా జిల్లాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
ఏపీని వణికించిన అర్నబ్ అతి తీవ్ర తుపాను నరసాపురం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే ప్రక్రియ పూర్తయిందని, తుపాను తీవ్రత తగ్గి తీవ్ర తుపానుగా బలహీనపడిందని తెలిపింది. బాపట్ల, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఏపీఎస్డీఎంఏ రెడ్ అలర్ట్ జారీ చేసింది.