జర్నలిస్టుల కోసం ప్రత్యేక ఏఐ ఏజెంట్ ఎల్లాక్లాను ప్రదర్శించిన టెక్నో

రిపోర్టర్: సతీష్ స్థలం: టెక్నాలజీ

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ టెక్నో డిజిటల్ ట్రెండ్స్ సహకారంతో తన మొబైల్ ఏఐ ఏజెంట్ ఎల్లాక్లా కోసం ప్రత్యేక వర్క్ఫ్లోలను ప్రదర్శించింది. జర్నలిస్టులు, కంటెంట్ సృష్టికర్తల కోసం రూపొందించిన ఈ ఏఐ టూల్ వార్తల పరిశోధన, స్క్రిప్ట్ తయారీ, వ్యక్తిగత రైటింగ్ స్టైల్ అనుసరణ, సోషల్ మీడియా పోస్టుల పరిశీలన వంటి అధునాతన సేవలను అందించనుంది. ఈ టూల్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు తమ వృత్తిపరమైన పనులను మరింత వేగంగా పూర్తి చేసుకోవచ్చని టెక్నో వెల్లడించింది.