స్థానిక ఎన్నికల పోరు: విజయనగరం జిల్లాలో ఖరారైన తుది అభ్యర్థుల జాబితా

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తుది జాబితా ఖరారైందని అధికారులు తెలిపారు. మొత్తం 255 నామినేషన్లకు గాను 152 మంది ఉపసంహరించుకోగా, బరిలో 103 మంది నిలిచారు. కొత్తవలస, తెర్లాం జడ్పీటీసీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు ఖరారయ్యారు. బొత్స కుటుంబం నుంచి ముగ్గురు మహిళలు పోటీలో నిలిచారు. కొన్ని స్థానాల్లో వైకాపా తరఫున కొత్త అభ్యర్థులకు అవకాశం లభించిందని అధికారులు వెల్లడించారు.