వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దుర్వినియోగం జరుగుతోందని ఆ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలని కాలరాస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.