బాడీ బిల్డింగ్ పోటీల్లో సంచలనం సృష్టించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Euless, Texas

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జోర్డిన్ గ్రేస్ బాడీ బిల్డింగ్ పోటీల్లోకి పునరాగమనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారని రెజ్లింగ్ వర్గాలు వెల్లడించాయి. టెక్సాస్లో జరిగిన హార్ట్ ఆఫ్ టెక్సాస్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ఆమె తన అసలు పేరు పాట్రిసియా గ్రెషామ్ తో బరిలోకి దిగారు. కేవలం నాలుగు వారాల పాటు రహస్యంగా శిక్షణ పొందిన ఆమె, ఈ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.