రాపూరు ఘాట్ లో తప్పిన పెను ప్రమాదం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని రాపూరు ఘాట్ లో ఓ లారీకి అకస్మాత్తుగా బ్రేక్ ఫెయిల్ కావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదుపుతప్పిన వాహనం రహదారి పక్కనే ఉన్న చెట్ల మధ్యకు దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో భారీ చెట్టు రోడ్డుపై పడటంతో రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.