అనంతగిరి ఆశ్రమ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: Laxman Regam స్థలం: అనంతగిరి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల-2లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు బి. మంగమ్మ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మంగమ్మ పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడమే గురువుల లక్ష్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సన్మానించి కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.