సౌదీ అరేబియాపై తీవ్ర ఉద్రిక్తతలు, హూతీల దూకుడుతో కలవరం

రిపోర్టర్: శివ స్థలం: World

యెమెన్‌లో హూతీ బలగాల దూకుడుతో సౌదీ అరేబియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లో దాడులు పెరుగుతుండటంతో పాటు వ్యూహాత్మక ప్రాంతాలను హూతీలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ప్రత్యక్ష సైనిక సహాయాన్ని నిరాకరించడంతో, సౌదీ తన భూభాగాన్ని రక్షించుకోవడానికి, సరఫరా మార్గాలను కాపాడుకోవడానికి స్వయంగా పోరాడాల్సి వస్తోంది.