ఎల్ నినో విపత్తును ఎదుర్కొనేందుకు రబీలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న సదస్సు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నర్సాపురంలో ఎల్ నినో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు గ్రామసభ నిర్వహించారు. వరికి బదులుగా రబీ సీజన్లో ఇతర పంటలు, పునాస పంటలు, ఆయిల్ పామ్స్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, ఎంపీడీవో కూతల నాగవేణి, ఏవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.