రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుంటానంటూ వ్యక్తి హంగామా

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా సృష్టించాడు. రైలు పైకెక్కి ఆయన చేసిన హల్‌చల్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.