పోతారంలో గురుశిష్యుల కలయికతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న పూర్వ విద్యార్థులు
రిపోర్టర్: Ajay
స్థలం: మల్యాల
మల్యాల మండలం పోతారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఐదు నుండి ఆరు ఎస్ఎస్సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు ఆత్మీయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పటి ఉపాధ్యాయులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాస అనుభవాలను గుర్తు చేసుకుంటూ పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు.