శంఖవరం మండలంలో పెద్దపులి సంచారంతో వణికిపోతున్న జనం

రిపోర్టర్: D.SATHISH స్థలం: శంఖవరం

శంఖవరం మండలం ఆవేల్తి గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుందనే ప్రచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి గ్రామ సమీపంలో పశువులపై దాడి చేసినట్లు గిరిజనులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఒక పశువు మృతి చెందగా, మరో పశువు తీవ్ర గాయాలతో బయటపడింది. చీకటి కారణంగా అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించలేకపోయారు. అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపితేనే ఇది పులి దాడేనా అనేది స్పష్టమవుతుంది.