'కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాలు': కేటీఆర్ కౌంటర్

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ కుటుంబంపై వస్తున్న భూముల ఆరోపణలను పూర్తిగా తిప్పికొడుతూ.. కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాల్లో ఉందని, తమది మొదటి నుంచి కూడా పెద్ద భూస్వామి కుటుంబమని ఆయన స్పష్టం చేశారు. తమకు ఆస్తులు రాజకీయాల తర్వాత కొత్తగా రాలేదని, రాజకీయాల కంటే ముందే తమ కుటుంబానికి పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని కేటీఆర్ తేల్చిచెప్పారు.