స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు: యథావిధిగా ప్రక్రియ

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో ఏడు జిల్లాల్లోని పందొమ్మిది పురపాలికలు మినహా మిగిలిన చోట్ల ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఎస్ఈసీ ఆదేశించారు.