గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నిందితుడు సురేశ్‌కు రిమాండ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సురేశ్‌కు కోర్టు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో సిట్ అధికారులు నిందితుడిని భారీ భద్రత నడుమ నూజివీడు సబ్‌జెయిల్‌కు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.