యువతను అలరించేందుకు వస్తున్న హైకూ: అక్టోబర్ 23న సినిమా విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

యువతను ఎంతగానో ఆకట్టుకునే సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ హైకూ సినిమా అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో ప్రముఖ రచయిత కోన వెంకట్ మరియు డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రంలో లవ్ అండ్ రిలేషన్షిప్లోని సున్నితమైన అంశాలను చాలా సహజంగా తెరకెక్కించినట్లు నటి శ్రీదేవి తెలిపారు.