రాంపూర్ లో ఉచిత వైద్య శిబిరంతో మురిసిన జనం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. వైద్యులు, హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ పర్యవేక్షణలో స్థానికులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూతి రామయ్య, ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.