టెక్ రంగంలో పెరుగుతున్న నిరుద్యోగ భయం: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన వైరల్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కెరీర్ ఎంచుకోవడం సరైన నిర్ణయమేనా అని అయేషా అనే టెక్ నిపుణురాలు సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కష్టపడి నైపుణ్యాలు నేర్చుకున్నప్పటికీ ప్రస్తుత మార్కెట్ లో తీవ్ర పోటీ ఉందని, ఉద్యోగం వచ్చినా ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు రాకతో టెక్ రంగంలో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.