వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరగలేదన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మద్యం కుంభకోణం జరగలేదని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో లక్ష కోట్లని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 44 వేల కోట్లని, ఇప్పుడు సిట్ 3 వేల కోట్లని రోజుకో అంకె మారుస్తూ కూటమి నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.