అంతరిక్షం నుంచి ఏఐ కవిత: సుందర్ పిచాయ్ హర్షం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

అంతరిక్షంలో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ సన్క్యాచర్ లో భాగంగా అంతరిక్షంలోకి పంపిన శాటిలైట్లోని ఏఐ మోడల్ రాసిన మూడు పంక్తుల కవితను ఆయన ప్రశంసించారు. భూమికి దూరంగా అంతరిక్షంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సాధ్యమవడంతో టెక్ రంగంలో కొత్త శకం మొదలైందని గూగుల్ వర్గాలు వెల్లడించాయి.