వైద్యార్హతలు లేకపోయినా విక్రయాలు జరుపుతున్న వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

వైద్యార్హతలు లేకుండా ఫేక్ డాక్టర్గా వ్యవహరిస్తూ ప్రాణాలకు ముప్పు కలిగించారనే ఆరోపణలతో డైట్ ప్రాచుర్యకర్త వీరమాచినేని రామకృష్ణపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇన్సులిన్ ఆపించడంతో బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.