మంచిర్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ పోలీస్ బందోబస్తు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లాలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రత చర్యలు చేపట్టినట్లు సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల జోన్ పరిధిలో ఏసీపీలు ముగ్గురు, సీఐలు పదిమందికి పైగా, ఎస్సైలతో పాటు మొత్తం 254 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.