అభివృద్ధికి నోచుకోని బెల్లంపల్లి ఆరో వార్డుపై కౌన్సిలర్ ఆవేదన

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆరో వార్డు అభివృద్ధికి నోచుకోవడం లేదని కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా నెలకొన్నాయని తెలిపారు. పన్నులు చెల్లిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నా వార్డు అభివృద్ధిపై అధికారులు, పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.