'యోగా నరసింహమూర్తి అలంకారంలో సింహ వాహనంపై మలయప్ప దర్శనం': తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: తిరుపతి
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు యోగా నరసింహమూర్తి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీకగా స్వామివారు మాడ వీధుల్లో విహరించగా, భక్తులు భారీగా తరలివచ్చి గోవింద నామస్మరణతో వీధులను మార్మోగించారు. వివిధ రాష్ట్రాల కళా బృందాల నృత్య ప్రదర్శనలు, జీయర్ స్వాముల గోష్ఠి గానం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.