ఉప్పుటూరులో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పోటెత్తిన శ్రేణులు
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు రూరల్
నెల్లూరు రూరల్ మండలం ఉప్పుటూరు గ్రామంలో కూటమి పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులు జెడ్పీటీసీ సభ్యులు చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఎంపీటీసి సభ్యులు ధనారసి శ్రీనివాసులు, పెంచల నాయుడుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప్పుటూరు సుబ్బారెడ్డి, పెంచలయ్య, బీజేపీ నేతలు దయాకర్, చెంచయ్య, చెంచుమునెయ్య, ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు కలిసి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.