రాజకీయ సంచలనం: కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా

రిపోర్టర్: రాము స్థలం: తమిళనాడు

దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో పూర్తి సమయం కేటాయించనున్నట్లు మురుగన్ పేర్కొన్నారు.