మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న మెగాస్టార్ చిరంజీవి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొదటిసారిగా మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన మెగా మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ లేదా బిగ్గెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ స్క్రీన్‌ను ఈ థియేటర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.