జంగా సినిమా నుంచి నటుడు మధునందన్ పోలీస్ ఆఫీసర్ లుక్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న జంగా చిత్ర యూనిట్ తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ను వెల్లడించింది. నటుడు మధునందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయనకు సంబంధించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ను మేకర్స్ సోమవారం అధికారికంగా విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పోస్టర్లో మధునందన్ చాలా సీరియస్గా కనిపిస్తున్న తీరు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతోందని చిత్ర బృందం పేర్కొంది.